ఐకా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ స్టోర్స్ ను ప్రారంభించిన కార్పొరేటర్ మహేశ్వరి కృపాసాగర్ ముదిరాజ్

Published: Monday December 20, 2021
మేడిపల్లి, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సూర్య హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐకా ఫ్యాన్సీ మరియు బ్యాంగిల్స్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 22వ డివిజన్ కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపాసాగర్ ముదిరాజ్ పాల్గొని ఫ్యాన్సీ బ్యాంగిల్స్ స్టోర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపాసాగర్ ముదిరాజ్ మాట్లాడుతూ వివాహా శుభకార్యాలకు మహిళలకు కావాల్సిన ఫ్యాన్సీ వస్తువులు బ్యాంగిల్స్ మొదలైన అలంకార వస్తువుల స్టోర్స్ ను ఈ కాలనీలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. మహిళలకు, పిల్లలకు కావాల్సిన అధునాతనమైన డిజైన్లలో ఫ్యాన్సీ వస్తువులను తక్కువ ధరలో విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. ఐకా ఫ్యాన్సీ మరియు బ్యాంగిల్స్ స్టోర్ ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు ఖుర్షీద్ గలీబాయి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.