*ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి* -20వ రోజు చేరుకున్న గుడిసె వాసుల

Published: Tuesday March 07, 2023
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామి


చేవెళ్ల మార్చ్06, (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో పేద ప్రజలు గత 20 రోజులుగా సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం మండు ఎండలో పోరాడుతుంటే ప్రభుత్వం లో కదలిక లేకపోవడం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామి అన్నారు.
గుడిసెల వాసులతో ఆయన సమావేశం అయ్యారు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఎన్నికల ముందు తీపి తీపి మాటలు చెప్పి మాయ చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రజాప్రతినిధులు పేదల అభివృద్ధి మరిచి దగా కోర్ల కోసం పనిచేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే సిపిఐ ఈ భూ పోరాటం చేయాల్సిన అవసరం లేకపోఏదని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి పేదలకు ఇండ్ల స్థలాలు వచ్చేవరకు భూ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా పేదల పట్ల సానుభూతితో ఆలోచన చేసి తక్షణమే గుడిసెలు వేసుకున్న పేదవాళ్లకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
ఒకవేళ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వకపోతే సిపిఐ ఆధ్వర్యంలో జరిగే సమరశీల మిలిటెంట్ పోరాటాల ద్వారా ఎదురయ్యే ప్రతి సమస్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభు లింగం మండల కార్యదర్శి సత్తిరెడ్డి మాధవి మంజుల సుధాకర్ గౌడ్, జై అంజయ్య మార్బుల్ మల్లేష్ శివ తదితరులు పాల్గొన్నారు