పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న దగ్గుల శ్రీనివాసరెడ్డి..

Published: Friday December 30, 2022
తల్లాడ, డిసెంబర్ 29 (ప్రజాపాలన న్యూస్):
 *హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మతల్లి దేవాలయాన్ని తల్లాడ మేజర్ పంచాయతీ అభివృద్ధి కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దగ్గుల శ్రీనివాస రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా గురువారం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి అమ్మవారికి వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట దగ్గుల శ్రీనివాస్ రెడ్డి లలిత కుమారి దంపతులు, ఉమేష్ రెడ్డి, సింధు, పుల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.*