*బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి జయంతి వేడుకలు* -యువతకు ఆదర్శప్రాయుడు* -చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగి

Published: Saturday April 15, 2023
చేవెళ్ల ఏప్రిల్ 14, (ప్రాజపాలన ):-

భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం యువతకు ఆదర్శమని  చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 132 పురస్కరించుకొని శుక్రవారం చేవెళ్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ... డాక్టర్ బీఆర్  అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులను  దాటుకుంటూ ఉన్నత విద్యను చదివి  ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఎదిగారని  తెలిపారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపేందుకు  ఎన్నో ఉద్యమాలు చేసి  వారిలో చైతన్యం తీసుకొచ్చారని  చెప్పారు.  ఎన్నో కష్టాలు పడ్డ  ఆయన జీవితంలో ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదని  ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగారని గుర్తుచేశారు. అలాంటి మహానుభావుడిని కొన్ని వర్గాలకే పరిమితం చేయడం సరికాదన్నారు. ఆయన జీవిత చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ రూపకల్పనలో  ముందుండటంతోపాటు  దేశాభివృద్ధిలో  ఆయన చేసిన కృషిని  ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, MPTC లు, నాయకులు, పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలుపాల్గొన్నారు.