యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

Published: Tuesday July 27, 2021
వికారాబాద్ 26 జూలై ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి అశోక్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధారూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ పటిష్ఠతకు తన వంతు ముమ్మర ప్రయత్నం కృషి చేయాలని కోరారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి, బాబా ఖాన్, రాజాపూర్ ఉప సర్పంచ్ ఆగమయ్య ముదిరాజ్ ధారూర్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.