సోనియాగాంధీకి అండగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన

Published: Saturday July 23, 2022

మంచిర్యాల టౌన్, జూలై 22, ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధి ని విచారణ పేరుతో ఈ. డీ.వేధించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరసన కార్యమంకు పిలుపునిచ్చారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన శుక్రవారం రోజున బెల్లంపల్లి చౌరస్తా లో నిరసన కార్యక్రమంలో చేశారు. జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి పై నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి చౌరస్తాలో ని నాలుగు వైపుల రహదారులను దిగ్భందనం చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాదాపు గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పిసిసి నుంచి పర్యవేక్షకుడిగా వచ్చిన నిరంజన్ రెడ్డి ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, వక్తలు మాట్లాడుతూ సోనియాగాంధీపై కేంద్ర ప్రభుత్వం ఈడీ రూపంలో వేధించడాన్ని తప్పు పట్టారు. దేశానికి ఎంతో త్యాగం చేసిన కుటుంబానికి చెందిన సోనియాగాంధీని అవినీతికి పాల్పడినట్టు విచారణ జరపడం శోచనీయమని అన్నారు. సోనియాగాంధీకి అండగా మోడీకి వినిపించేలా కార్యకర్తలు నినదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ మంత్రులు బోడ జనార్దన్, వినోద్, మాజీ ఎమ్మెల్యే లు నల్లాల ఓదెలు, సంజీవరావు, శ్రీదేవి, ఐ. ఎన్ టీ.యూ.సీ నాయకుడు జనక్ ప్రసాద్,చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జి రఘునాథ్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నూకల రమేష్, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.