*కంటి వెలుగు కార్యక్రమం ను విజయవంతం చేయాలి*మధిర రూరల్

Published: Wednesday December 21, 2022
డిసెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మధిర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు  ఎం లలిత కుమారి  అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ఈ సందర్భంగాా మాట్లాడుతూ  జనవరి18 నుంచి  జరగబోయే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న* *కంటి వెలుగు* కార్యక్రమమును   విజయవంతం చేయాలని మండల టాస్క్ఫోర్స్ కమిటీ, వివిధ విభాగాల అధికారుల సమావేశంలో వెల్లడించారుఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత  మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజలందరినీ  100% భాగస్వామి చేసి కంటి పరీక్షలు ప్రజలందరూ చేపించుకునేటట్లుగా  వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు  పనిచేయాలని కోరినారు ఎంపీడీవో విజయ్ విజయ్ భాస్కర్ రెడ్డి.మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామపంచాయతీలలో, రైతు వేదికలలో  ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు  పాల్గొని ప్రజలకు ఈ కంటి వెలుగు కార్యక్రమం పై  ఆరోగ్య అవగాహన కల్పించి 100% కంటి పరీక్షలు చేయించుకునేటట్లు చూసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని  కోరారు.మున్సిపల్ కమిషనర్ శ్రీమతి అంబటి రమాదేవి మాట్లాడుతూ మధిరలోని మున్సిపాలిటీ పరిధిలోఈ కంటి వెలుగు కార్యక్రమమును విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శశిధర్, మండల రెవెన్యూ అధికారి రాళ్ల బండి రాంబాబు, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఎంఈఓప్రభాకర్ రావు, ఎలక్ట్రికల ఏయ్్ నాగేశ్వరావు, అనిల్, యు ఆర్ డూ శాస్త్రి, మాటూరుపేట దెందుకూరు ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు శరత్ బాబు,  గోవిందు,రమాదేవి, కౌసల్య, భాస్కర్ రావు లంకా కొండయ్య,సుజాత , జ్యోతి కుమారి పాల్గొన్నారు.