17 వ డివిజన్ లో కరోనా టీకా సెంటర్ ప్రారంభం

Published: Thursday September 09, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 7, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి, టీకా అంటే భరోసా, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ లోని కురుమ సంఘ భవనంలో మారి స్వచ్చంద సంస్ధ బాలాపూర్ వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా సెంటర్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.... ఈ రెండు రోజులు వీలైన మేరకు బాలాపూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లలేని వారు, ఇక్కడే సదుపాయం కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టీకా అంటే భరోసా, కానీ కరోనా పట్ల అప్రమత్తంగానే ఉండాలని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. టీకా అందరూ తప్పక వేసుకొని 100 శాతం టీకాలు వేసుకున్న ప్రాంతంగా మొదటిస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. కరోనా టీకాలు ప్రజలవద్దకే తీసుకువచ్చి ఇస్తున్న వైద్యాధికారులకు వారికి సహకరిస్తున్న మారి సంస్థ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహార్, వైద్యాధికారి రావు, నాయకులు జైహింద్, కురుమ సంఘం అధ్యక్షుడు మల్లేష్, మారి సంస్థ కో ఆర్డినేటర్ సాంబశివ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.