సీతారాంపేటలో లడ్డు కైవసం చేసుకున్న యాచారం శివ

Published: Tuesday September 13, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేట్ గ్రామంలో చౌరస్తా యూత్ అసోసియేషన్ సభ్యులు  కౌన్సిలర్ శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో వినాయకుడి పూజలో నిర్వహించి తొమ్మిది రోజుల  నవరాత్రుల్లో  ఉత్సవాలు ఘనంగా నిర్వహించి దర్శించుకున్నారు భక్తులు  తొమ్మిది రోజులు లడ్డు పూజలు నిర్వహించి లడ్డు వేలం పాట లోబాగంగ  గ్రామంలో పెద్దల సమీక్షంలో వేలపాట కొనసాగించి వేలపాట లో లడ్డును 42 400 రూపాయలకు కైవసం చేసుకున్న యాచారం శివ మహా ప్రసాదం కైవసం చేసుకున్నారు. వారికి వారి కుటుంబానికి ఆయుర్ ఆరోగ్యాలు గణనాథుడు  వారిని కుటుంబాన్ని చల్లగా చూడాలని స్థానిక కౌన్సిలర్ శ్రీలత రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి. కోలాటపాటలు ఆర్కెస్ట్రా ప్రజలను కనువిందు చేసి భక్తి పాటలు పాడుతూ ప్రజలను మమేకమై ఆటల్లో ముంచేసిన కళాకారులు యువకులను ఉత్తేజపరిచే కళారూపాలు ప్రదర్శించి చౌరస్తా యూత్ అసోసియేషన్ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి శోభయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  సీతారాంపేట్ గ్రామంలో అన్నదాన ప్రభువులు కొండ్రు జయమ్మ, వారి కుమారులు కొండ్రు నాగరాజు, కొండ్రు క్రాంతి కుమార్. వారి చేతుల మీదుగా అన్న ప్రధానం చేశారు కార్యక్రమానికి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వంశీ కృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.