రాఘవేంద్ర లిటిల్ హన్స్ హైస్కూల్లో వ్యాసరచన , డ్రాయింగ్ పోటీలు

Published: Tuesday August 30, 2022
జన్నారం, ఆగస్టు 29, ప్రజాపాలన: 
 
తెలుగు భాషా దినోత్సవాన్ని పునస్కారించుకోని  మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హన్స్ హైస్కూల్ లో సోమవారం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు  నిర్వహించారు.  పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు., ఈ సందర్భంగా ఆ పాఠశాల కరస్పాండెంట్    మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి పంతుల జన్మాదినమైన (1863-1940) ఆగస్టు 29 వ తేదీని తెలుగు భాష దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తున్నదని తెలిపారు. అదేవిధంగా ద్యాన్ చంద్ 1905 ఆగస్టు 19 జయంతి సందర్భంగా రాఘవేంద్ర లిటిల్ హన్స్ హైస్కూల్ ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవం ను జ్యోతి వేలిగించి ఘనంగా నిర్వహించడం జరిగినది. భారతీయ సుప్రసిద్ధ  హాకీ ఆటగాడు ద్యాన్ చంద్, హకీ క్రీడల్లో ప్రంపంచ అత్యుత్తమ క్రీడాకారులలో ఒకరు మూడు సార్లు వరుసగా ఒలంపిక్ క్రీడల్లో (1928, 1932, 1936 వరుసగా బంగారు పతకాలు సాదించిన పెట్టిన ద్యాన్ చంద్ ని పలువురు వక్తలు కొనియాడారు.  ఈ కార్యాక్రమంలో ఉపాద్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.