బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

Published: Tuesday June 08, 2021

"సఖి నిర్వాహకురాలు సౌజన్య"
వయసు పెంపు పై అభిప్రాయ సేకరణ

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూన్ 07, ప్రజాపాలన : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని మహిళల ఆరోగ్యం బాల్య వివాహాల వలన దెబ్బతింటుందని, సఖి సెంటర్ నిర్వాహకురాలు సౌజన్య తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సఖి కార్యాలయంలో వివాహ వయసు పెంపు పై పలువురి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సఖి నిర్వాహకురాలు సౌజన్య మాట్లాడుతూ ప్రభుత్వం వివాహ వయస్సు పెంచడానికి విద్యార్థుల నుండి అభిప్రాయాల సేకరణ చేస్తుందని తెలిపారు. వివాహ వయస్సు18 నుండి 21 కి పెంచడం మంచిదన్నారు. రాష్ట్రాలతో పోలిస్తే మహిళల ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. దీనిలో భాగంగానే పెద్ద మొత్తంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థుల నుండి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మమత, కేస్ వర్కర్ మౌనిక, ఐటి రుబీనా, పారామెడికల్ హారిక, లు తదితరులు పాల్గొన్నారు.