ఎన్ సి డి మందుల కిట్ల పంపిణీ

Published: Friday November 25, 2022
మధిర  నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధ) మండల పరిధిలోని దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీ వైద్యాధికారి శశిధర్ ఆధ్వర్యంలో మడుపల్లి, మధిర ఒకటి మరియు రెండు సబ్ సెంటర్ పరిధిలో గురువారం ఎన్ సి డి(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సిడి అంటే అంటు వ్యాధులు కానివి అని తెలిపారు. షుగర్, బిపి మందులను వాడుతున్న వారికి అన్ని గ్రామాల ఆశా కార్యకర్తల ద్వారా నెలకి సరిపోను మందులు ఈ కిట్ బ్యాగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు.                
ఈ మందుల ద్వారా ఉన్నతమైన జీవనానికి, ఆరోగ్యకరమైన అలవాట్లు గురించి, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ మందులు చదువురాని వారు కూడా సులువైన పద్ధతిలో గ్రహించుటకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రంగుల కవర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వి సుబ్బలక్ష్మి వైద్య సిబ్బంది గోవింద్, పద్మావతి, లంకా కొండయ్య, సుబ్బలక్ష్మి, కౌసల్య, విజయ కుమారి, విజయలక్ష్మి, లక్ష్మి, లీల, సునీల, నాగేశ్వరావు, శ్రీనివాసరావు తదితరులు  పాల్గొన్నారు.