క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు

Published: Saturday September 03, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి.గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా పిఆర్సి తరహా జీవో నెంబర్ 60 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన వివిధ కేటగిరీల వారిగా వేతనాలు ఇవ్వాలని శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనేక సంవత్సరాలుగా గ్రామాలకు సేవ చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి పిఆర్సి తరహా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 51 నీ సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. 2022 సంవత్సరం జనాభాను పరిగణలోకి తీసుకొని సిబ్బందిని నియమించాలి. అందరికీ వేతనాలు చెల్లించాలి. తొలగించిన పంచాయతీ సిబ్బంది అందరిని పనిలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలి. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని పంచాయతీ అసిస్టెంట్లు గా నియమించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రామపంచాయతీలో పనిచేసే ప్రతి కార్మికుడికి ఎస్క్ డే 2లక్షల ఇన్సూరెన్స్ ను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. మేజర్ గ్రామ పంచాయతీలలో ఆదాయం ఉన్నచోట వేతనాలు పెంపుకు అనుమతి ఇవ్వాలి. ప్రమాదంలో మరణించిన గ్రామపంచాయతీ సిబ్బంది కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లించాలి. పంచాయతీలో పనిచేస్తున్న అర్హత గల సిబ్బందికి ప్రమోషన్ ఇవ్వాలి. 8గంటల పని దినాన్ని అమలు చేసి, ఆదివారం, పండగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి పల్లె ప్రగతి విజయవంతం చేసింది గ్రామపంచాయతీ కార్మికులని గుర్తు చేశారు. కనుక గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు పాండు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య, మంచాల మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కన్వీనర్ ఎల్లేష, కారోబార్ లు దేవదాస్, జంగయ్య, సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.