వెల్వర్తి లో తెలంగాణ జెండా పండగ వేడుకలు

Published: Friday September 03, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలో తెలంగాణ జెండా పండుగ వేడుకల్లో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కలుకూరి రాములు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, మంత్రి కే తారక రామారావు ఆదేశాల మేరకు గ్రామాల్లో జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చెవ్వ వెంకటేశం, రాములు, కుమార్, యాదగిరి, వెంకటేశం, వెంకటేష్, పరుశరాములు, బాలరాజ్, ప్రవీణ్, రాములు, శంకరయ్య, అంజయ్య, వీరస్వామి, గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు సరోజ, కవిత కలమ్మ, విజయలక్ష్మి, నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.