దేశసేవకు అంకితమైన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం

Published: Tuesday April 06, 2021
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్ నగర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద స్వతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, భారతదేశ దివంగత ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని ఆ మహనీయుడుకి చిత్రపటానికి పూలమాల వేసి నమస్సుమాంజలు తెలిపారు. తదనంతరం అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త అని, ఆయన సేవలను జ్ఞానేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ‘అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిదని, స్వాతంత్య్ర సమర యోధుడిగా, ఉప ప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ అభిమానులు రాజు, అనిల్, నర్సింగ్ రావు, వెంకట్, నగేష్, వినోద్, రజినీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.