నక్కల గరు భూ సీసీ కెమెరాలు ఏర్పాటు

Published: Wednesday November 17, 2021
నవంబ16 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండల పరిధిలోని నక్కలగరుబు గ్రామంలో గ్రామ సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ అధ్యక్షతన నిర్వహించిన సీసీ కెమెరాల ఆవశ్యకత వాటి ఏర్పాటు కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా మధిర రూరల్ ఎస్ఐ  బి. రవి కుమార్ పాల్గొన్నారు నూతనంగా రూరల్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా మన గ్రామానికి వచ్చిన సందర్భంలో ఎస్సై ని సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్లు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియపరిచారు ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ మాట్లాడుతూ గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దీని ద్వారా గ్రామంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉంటుందని ఏదైనా దొంగతనం జరిగినప్పుడు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగతనాలు అరికట్టడం సాధ్యపడుతుందని మరియు dial 100 గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రజలు వార్డు సభ్యులు పాల్గొన్నారు