ఉద్యాన పంటపై అవగాహన సదస్సు

Published: Wednesday September 29, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : వినూతల గ్రామంలో ఈరోజు రైతు వేదిక నందు రావినూతల క్లస్టర్ పరిధిలో పెద్ద బీరవల్లి  రావినూతల గ్రామ రైతులకు వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ మరియు ఉద్యాన పంటపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల మాట్లాడుతూ యాసంగి వరి పంటకు బదులుగా పెసర, మినప, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేయవలసిందిగా తెలిపినారు. వరి సాగు బోర్లు మరియు బావుల కింద సాగు చేయకూడదని తెలిపినారు. ఉద్యాన పంట అయినా పామాయిల్ పంట ప్రస్తుత పరిస్థితులలో అధిక లాభాలు ఉన్నందున రైతులకు పామాయిల్ సాగు వైపు దృష్టి  చూపాలని అదేవిధంగా అధిక లాభాలు పొందవచ్చునని తెలిపినారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా రైతు సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ మార్కెట్లో మంచి ధర ఉన్న పత్తి సాగు చేయవలసిందిగా తెలిపినారు. వరి పంట కొనుగోలు కేంద్రం లేనందున యాసంగి వరి పంటను రైతులు సాగు చేయవద్దని సాగు చేసినట్లయితే మార్కెటింగ్ సమయంలో రైతులు ఇబ్బంది పడవద్దని తెలిపినారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పత్తి పంట లో వచ్చే గులాబి రంగు పురుగు మరియు వరి పంట లో వచ్చు చీడపీడతలు గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంను బోనకల్ మండల రైతు బంధు సమితి సభ్యులు వేమూరి ప్రసాద్, అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు మందడపు తిరుమల రావు, బొమ్మకంటి సైదులు, మండల రైతు బంధు సభ్యులు బంధం శ్రీను, రావినూతల గ్రామం రైతు బంధు సమితి సభ్యులు ఎస్ కే జానీ, రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, రావినూతల ఎంపీటీసీ కందిమళ్ల రాధ, ఉపసర్పంచ్ బోయినపల్లి కొండలు, మరియు బోనకల్ వ్యవసాయ శాఖ అధికారి శరత్ బాబు, రావినూతల ఏఈఓ తేజ తదితరులు పాల్గొన్నారు.