మీరు నేను కారేక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ అభివృద్ధి పనులు పరిష్కారం

Published: Monday February 27, 2023
సారంగాపూర్, ఫిబ్రవరి 26 (ప్రజపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పోచంపెట్ గ్రామంలో గంగమ్మ తల్లినీ దర్శించుకొని మీరు నేను కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వాడవాడలో తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రజల సమస్యలను అడుగుతూ అధికారుల ద్వారా వాటిని పరిష్కరిస్తూ గ్రామంలో పల్లె ప్రకృతి వనం కంపోస్ట్ షెడ్డు వైకుంఠ దామన్ని ప్రారంభించి సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. లబ్దిదారులకు మంజూరైన కేసిఆర్ కిట్స్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. పెంబట్ల గ్రామంలో లబ్దిదారులకు మంజూరైన 60 వేల రూపాయల విలువగల సీఎం సహాయ నిది చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం గ్రామంలో పద్మశాలి  కుల సంఘానికి నిధులు మంజూరు చెయ్యడంతో సంఘ నాయకులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ గుర్రాల రాజేందర్ రెడ్డి సర్పంచులు ఆకుల జమున పల్లికొండ రమేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.