బురద నీటిని రోడ్డుపై వదిలినందుకు జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు

Published: Tuesday June 28, 2022
బెల్లంపల్లి జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని పోస్టాఫీసు బస్తీకి చెందిన
 బలరాం చౌబే తండ్రి మిట్టల్ లాల్ బోర్ వేయడం వలన బురద నీరు రోడ్డు మీదకు వచ్చి రోడ్డు పైన వెళ్లే వాహనదారులకు మరియు పాదాచారలకు ఇబ్బంది కలిగించినందుకు  పది వేల రూపాయల జరిమానా విధించినట్లు బెల్లంపల్లి ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆదేశాల మేరకు బోరును తవ్వగా వచ్చిన మురికి నీరు అంతా రోడ్లపైకి రావడంతో, ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి, రానున్న రోజుల్లో ఎవరు కూడా ప్రజలకు అసౌకర్యం కలిగించే పనులు చేయకూడదని వారు పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు, విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ కూడదనే ఉద్దేశంతోనే  ,పది వేల రూపాయల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.
 ఈ కార్యక్రమంలో ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు జెవాన్ రామస్వామి, తదితరులు పాల్గొన్నారు .