ఘట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన 2023-24 సంవత్సర సాధారణ అంచనా నిధుల సమావేశం

Published: Saturday April 01, 2023
ఈ సంధర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ 2023-24 సంవత్సర  సాధారణ అంచనా నిధులు 12 కోట్ల 60 లక్షల నిధులను కేటాయించుకోవడం జరిగిందని.  ఆ నిధులను ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని  కార్మికుల వేతనాలకి, కరెంటు బిల్లులకు ఉపయోగించుటకు అని తెలుపుతూ, ఘట్కేసర్ సాధారణ మెయింటనెన్స్, అదేవిధంగా అన్ని వార్డుల అభివృద్ధి కి  కృషి చేస్థానని,  ప్రజలకు పారదర్శక పాలన, మెరుగైన మౌళిక సదుపాయలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సంబంధిత అధికారులు తమకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసి అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని దిశానిర్థేశం చేయడం జరిగింది. ప్రతి రెండు వార్డులకు ఒక చెత్త సేకరణ వాహనాన్ని ఏర్పాటు చర్యలు చేపట్టాలని సూచించారు, మునిసిపల్ పరిధిలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు,భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ ఇతర సమస్యలు లేకుండా చూడాలని సూచించడం జరిగింది. సీసీ మరియు బీటి రోడ్లు, డ్రైనేజీ మొదలైన మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టవలసిందిగా అధికారులను సూచించారు.  స్వచ్ఛ ఘట్కేసర్" లక్ష్యంగా ముందుకు వెళ్లాలని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, కొమ్మగోని రమాదేవి, బొక్క సంగీత, బండారు ఆంజనేయులు, కొమ్మిడి అనురాధ, సల్లూరి నాగజ్యోతి, చిలుగురి హేమలత, బర్ల శశికళ, కడుపొల్ల మల్లేష్, జహంగీర్, బేతల నర్సింగ్, కుతాది రవీందర్, కో-ఆప్షన్ సభ్యులు  పల్లె అరుణ, బొక్క సురేందర్ రెడ్డి,  sk షౌకత్ మియా, మున్సిపల్ మేనేజర్ అంజి రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ , గణేష్, జూనియర్ అకౌంటెంట్ సంగీత, జూనియర్ అసిస్టెంట్ సాయి రాజ్, రవి కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.