రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనకు

Published: Saturday September 17, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరోస్ 16 సెప్టెంబర్ ప్రజా పాలన : ప్రతి సంతత్సరం జూన్ 2న  తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహించుకున్నట్లు సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వతంత్రం లభించిందని, దీనితో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టి 75 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సంధర్లంగా తెల్లంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని వికారాబాద్ శాసన  సభ్యులు మెతుకు ఆనంద్ తెలిపారు. 75 వ తెల్లంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా వికారాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 16 శుక్రవారం మొదటి రోజు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంబించుకోవడం జరిగినది.   ఈ సంధర్భంగా శాసన సభ్యులు మెతుకు ఆనంద్ జిల్లా కలెక్టర్ నిఖిలతో కలసి కలెక్టర్ కార్యాలయం నుండి భారీ ర్యాలీని ప్రారంబించారు.  ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు వారి సిబ్బందితో  నిర్వహించిన ర్యాలీ కలెక్టర్ కార్యలయం నుండి స్థానిక సంఘం లక్ష్మి బాయి పాఠశాల వరకు జాతీయ జెండాలతో తెలంగాణ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.  అనంతరం సంగమ్ లక్ష్మి బాయి పాఠశాలలో ప్రిన్సిపాల్ రమణమ్మ ఏర్పాటు చేసిన వజ్రోత్సవ సభను ఉద్దేశించి శాసన సభ్యులు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, నీళ్లు, నిధులు,  నియామకాల కోసం పోరాడి తెలంగాణ సాదించుకున్నామని, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నిజాం నవాబు, రజాకార్లతో సాయుధ పోరాటం చేసి 1948 సెప్టెంబర్,17 న రాజరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన దిశగా పరివార్తన చెంది విశాల భారత దేశములో తెలంగాణ అంతర్భాగమైన రోజన్నారు.  దీనినే కొందరు విమోచన దినంగా, మరికొందరు సమైక్యత దినంగా అంటుంటారన్నారు. సాయుధ పోరాటం మతం కొసం చేసింది కాదని, తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం కొసం చేసిన పోరాటామని అభివర్ణించారు.  ఎంతో మంది కవులు ఈ ఉద్యమంలో పాల్గొని ఎనలేని కృషి చేశారని వారి పాత్రను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జాతీయ సమైక్యత వాజ్రోత్సవ  ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు మహిళలు, ప్రజలు తరలి వచ్చారన్నారు.  సెప్టెంబర్,17న పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లిప్ ఉదయం 9:00 గంటలకు ఉప సభాపతి పద్మా రావు జాతీయ పతకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అందరు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.  అదే రోజు యస్. టి. ప్రజా ప్రతినిధులు,ఉద్యోగులను ప్రత్యేక వాహనములలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి హైదరాబాద్ కు తరలించడం జరుగుతుందన్నారు. అలాగే 18 న కలెక్టర్ కార్యాలయంలో సాయంత్రం 4:00 గంటలకు జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ సందర్బంగా కవులు, కళాకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.  తెలంగాణ కొసం పోరాడిన వారందరిని ఈ సందర్బంగా స్మరించుకోవాలన్నారు. జిల్లా యస్పి కోటిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యత కార్యక్రమం జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.  తెలంగాణ సంస్థానం నిజాం రాజుల అధీనంలో ఉండేదని, భారతదేశం స్వతంత్ర దేశం అయినప్పటికిని తెలంగాణకు విముక్తి మాత్రము ఒక సంవత్సరం ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17 లో లభించిందని తెలిపారు.  సెప్టెంబర్,17 న తెలంగాణ అఖండ భారత దేశంలో విలీనం అయినందున తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, ఎంపీపీ చంద్రకళ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామ్ రెడ్డి, వికారాబాద్ పట్టణ కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.