బిజెపి బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా కౌశిక హరి నియామకం

Published: Wednesday October 19, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్చార్జిగా గోదావరిఖని పట్టణానికి చెందిన కౌశిక హరిని, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్ని నియోజకవర్గాలతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గానికి కౌశిక హరి ని ఇటీవల  నియమించినట్లు, పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్ తెలిపారు.
మంగళవారం నాడు ఆయన "ప్రజా పాలన" ప్రతినిధి తో మాట్లాడారు, ఇకనుండి కౌశిక హరి మాత్రమే నియోజకవర్గ ఇన్చార్జి అని, వేరే ఎవరైనా సమావేశాలు పెట్టి నియోజకవర్గ ఇన్చార్జి తనే అంటూ ప్రచారం చేసుకుంటే పార్టీ పరంగా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.