వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం దాస్టీకం

Published: Monday February 20, 2023
* అధికార మదంతో పోలీసు జులుం
* వైఎస్ఆర్ టి పి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్
వికారాబాద్ బ్యూరో 19 ఫిబ్రవరి ప్రజాపాలన : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకుంటే రాజకీయ ముప్పుతుందని భ్రమ పడడం అవివేకం అని వైఎస్ఆర్ టిపి జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం ప్రజా పాలన బ్యూరో ఇంచార్జ్ తో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కుటుంబ పాలన మితిమీరుతోందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడాల్సిన రోజులు అతి దగ్గరలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో భూ ఆక్రమణ దందాకు తెరలేపిన ఉద్దండులు బిఆర్ఎస్ నాయకులని తీవ్ర విమర్శ చేశారు. ధరణి పోర్టల్  భూములను కాజేస్తున్నారని చెప్పారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలను, అవినీతిని, భూ కబ్జాలను ప్రశ్నించినందుకే వైఎస్ షర్మిలను అరెస్టు చేశారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆమెకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తెలంగాణ ప్రభుత్వం షర్మిలను అరెస్టు చేయడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణలో రాబోయేది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. షర్మిలను వెంటనే విడుదల చేయాలని, పాదయాత్రను యధావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.