కవితక్క జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

Published: Monday March 14, 2022

సారంగాపూర్, మార్చి 13 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క జన్మదినం సందర్భంగా తెరాస నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ ఎంపీటీసీ జోగినపల్లి సుధాకర్ రావు భూక్య లావణ్య మమత సర్పంచులు గుర్రాల రాజేందర్ రెడ్డి ఢిల్లీ రామారావు ఏలేటి నర్సింహారెడ్డి తోడేటి శేఖర్ జగన్ వివిధ గ్రామాల సర్పంచులు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.