దెందుకూరులో ఘనంగా ప్రారంభమైన అంకమ్మ తల్లి జాతర

Published: Friday March 03, 2023

వేడుకలు. మధిర రూరల్ మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు నుండిదెందుకూరు గ్రామ ప్రజలు భక్తులు ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి మన గ్రామ ఇలవేల్పు దేవతలైన అంకమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల 8వ సంవత్సర జాతర మహోత్సవ ఆహ్వానము 2 తారీకు నుండి నుండి 6 తేదీ  వరకు జరుగుతుంది 2 తారీకు ఉదయం ఐదున్నర గంటలకు తోర్నపాకు సాయంత్రం 4గంటలకు అమ్మవార్లకు గ్రామోత్సవ కార్యక్రమం జరుగును  3 తారీకు ఉదయం 11 గంటల నుండి జల బిందెల కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు పెద్దకాపు పెద్ద గొల్ల సమక్షంలో అమ్మవార్లకు బియ్యం కొల నాలుగో తారీఖు ఉదయం 10 గంటల నుండి బొడ్రాయి వరకు జల బిందెల కార్యక్రమం  ఉదయం 11 గంటలకు అమ్మవారి జాతరలో అత్యంత విశేషంగా జరుగు కార్యక్రమం లగుడు గొర్రె కార్యక్రమం తరువాత సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి ఉత్సవ వాహనమైన పూలకప్పర ఊరేగింపుగా గ్రామ పురవీధుల్లోకి వస్తుంది 5 తారీకు న ఆదివారం రోజు అమ్మవారి లకు భక్తులందరూ బోనాలు చెల్లించు కార్యక్రమం తదనంతరం సాయంత్రం 5 గంటల నుండి శిరిమాన్ కార్యక్రమం కలదు కార్యక్రమం ఉద్దేశం గ్రామంలోని భక్తులకు సత్సంతానం కలగాలని ఆడపడుచులకు అమ్మవారు అండదండలు ఉండాలని జరిగే కార్యక్రమం కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అంకమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేస్తున్నారు