కురుమల అభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలి : తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘాల జె ఎ సి. హైదర

Published: Friday November 18, 2022
కురుమల సంక్షేమానికి,అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలి అన్నారు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘాల జె ఎ సి నాయకులు ముత్త స్వామి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘాల జె ఎ సి ఆధ్వర్యంలో కురుమల సంక్షేమం అన్న అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జె ఎ సి నాయకుడు ముత్త సంపత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమలు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. బీసీ లలో అధిక జనాభా ఉన్న కులమైన కురుమలకు రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం శోచనీయం అన్నారు. కురుమ లు ఎవరిపై ఆధారపడరని, నిరాడంబరమైన జీవితం గడిపే కురుమలు అభివృద్ధి కి దూరంగా ఉన్నారన్నారు.గొర్రెల కాపరులుగా ఉన్న తమ సమస్యలను పట్టించుకున్న వారు లేరన్నారు.
ఈ సందర్బంగా పలు జిల్లాల నుండి సమావేశంలో పాల్గొన్న కురుమ ప్రతినిధులు ప్రసంగించారు. సంఘాలు ఎన్ని ఉన్న కురుమల ఆత్మభిమానానికి, అభివృద్ధి కి చేయూత ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముత్త సంపత్, కోస్గి శ్రీను, కడారి నరేంద్ర, బెళ్ళం మాధవి, శంకరొళ్ల రవి, కంచు ప్రభాకర్, దుర్గయ్య, రమణ, నర్రి స్వామి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.