ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు బంగారు బాటవుతుంది

Published: Friday September 16, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 15 సెప్టెంబర్ ప్రజా పాలన : శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్  నిఖిల అన్నారు అన్నారు. గురువారం సంఘం లక్ష్మీబాయి పాఠశాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్ధినీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంఘం లక్ష్మీబాయి బాగా చదువుకొని సమాజంలో సంఘ సంస్కరణలు గావించడంతోపాటు రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదగడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ ఉన్నతంగా చదివి మంచి స్థాయిలో ఎదగాలని  కోరుకుంటున్నా ని కలెక్టర్ అన్నారు.  పాఠశాల ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.  మురుగు కాలువల నీటి నిల్వలతో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కార కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. ప్రహరీ గోడ పెంపుకు అదేవిధంగా పాఠశాల ఆవరణలో సోలార్ వీధి దీపాల ఏర్పాటుకై స్థలాన్ని గుర్తించి తెలియజేయాలని మండల విద్యాశాఖ అధికారికి ఆదేశించారు. విద్యార్థినిల సౌకర్యార్థం డార్మెటరీ, పాఠశాల మరమ్మత్తులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయాలని ఎంఈఓ కు సూచించారు. మన ఊరు  మనబడి కార్యక్రమం కింద పాఠశాలను చేర్చి అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటారని కలెక్టర్  హామీ ఇచ్చారు. పాఠశాలకు   ఏజెన్సీ ద్వారా వాటర్ హీటర్ కు సంబంధించి అంచనాలను అందజేసినట్లయితే సామర్థ్యం మేరకు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు,  సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలి అన్నారు.  ఉన్నత విద్యను అభ్యసించి బావి భారత పౌరులుగా దిద్దుకోవాలని ఆయన సూచించారు. పోలీస్ శాఖ పరంగా మా సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రమణమ్మ,  ఎంఈఓ బాబు సింగ్,పాఠశాల  ఉపాధ్యాయులు,  సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు.
 
 
 
Attachments area