అక్రమ బోర్లకు అడ్డాగా అమీర్ పేట్

Published: Tuesday August 31, 2021
అమీర్ పేట్ జోన్ (ప్రజాపాలన ప్రతినిధి) : హైదరాబాద్ నగరంలో జనసాంద్రత ఎక్కువున్న ప్రదేశాలలో అమీర్ పేట్ ముందువరుసలో ఉంటుంది. అటువంటి అమీర్ పేట్ లో వేసవి రాగానే నీటి ఎద్దడి ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇక్కడ అక్రమ బోర్లపై అధికారులు ఇంతకాలం ఉక్కుపాదం వేసేవారు. గత కొంతకాలంగా మళ్లీ అక్రమంగా బోర్లు వేయడం ఎక్కువవుతున్నా అధికారులు అలసత్వం ప్రదర్శించడం ప్రజల్లో అధికారులపై సందేహానికి కారణం అవుతుంది. కొంతమంది స్థానికులు అక్రమ బోర్లపై అధికారులకు సమాచారం అందించినా స్పందించాల్సింది పోయి సమాచారం అందించిన వారినే రాత పూర్వక ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారుల్లో చలనం కలిగి అక్రమ బోర్లపై ఉక్కుపాదం మోపుతారో లేదో చూడాల్సిందే.