ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి *ముందస్తు సమాచారం లేకుండా దౌర్జన్యంగా కూల్చ

Published: Saturday November 26, 2022
,అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో సాగర్ ప్రధాన రహదారికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న వివిధ షాపుల ముందు భాగంలో ఉన్న తాత్కాలిక నిర్మాణాలు షెడ్లు,వీధి వ్యాపారస్తుల డబ్బాలు,పైకప్పు, మెట్ల నిర్మాణ సముదాయాన్ని జెసిబిల సహాయంతో   శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పోలీసులు సమక్షంలో  కూల్చివేతలు జరిపారు.ఈ కూల్చివేతలను తెలుగుదేశం పార్టీ  మున్సిపల్ అధ్యక్షుడు రావుల వీరేశం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు  బుచ్చయ్య గౌడ్  వ్యాపారస్తులతో కలిసి అడ్డుకొని,అధికారులతో వాదించి కొంత సేపు కుల్చివేతలు నిలువరించిన  అనంతరం అధికారులు పోలీసుల సహాయంతో  అక్కడున్న వారిని చదరగొట్టి కూల్చివేతలు  జరిపారు.టీడీపీ నేతలు మాట్లాడుతూ తుర్కయంజాల్ మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని,చిరు వ్యాపారులకు,వీధి వ్యాపారులకు,స్థానిక షాప్ యజమానులకు ఏటువంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం ముందస్తు మున్సిపల్ ఆఫీస్ నుండి ఎలాంటి నోటీసు లేకుండా  హఠాత్తుగా వచ్చి హుటాహుటిన దౌర్జన్యంగా కూల్చివేతలు చేస్తూ అధికారులు రౌడీల్లా ప్రవర్తించారని  తీవ్రంగా మండిపడ్డారు.ఎన్నో ఏళ్లుగా  వ్యాపారం చేస్తూ పేద,బడుగు, బలహీన వర్గాల చెందిన  ప్రజలు తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని ఈ ప్రజాప్రతినిదులు చేసిన పనికి వ్యాపారస్తుల కుటుంబాలు పూర్తిగా రోడ్డునపడ్డాయన్నారు.  వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించి,వేరొక చోట వ్యాపారం చేసుకొనుటకు స్థలం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులకు ఓట్లేసి గెలిపించి గద్దెనెక్కిస్తే,తమను రోడ్డులో పడేయడం చాలా అన్యాయమని  నేతలు రావుల వీరేశం,బుచ్చయ్య గౌడ్ అన్నారు.