ధర్నా విజయవంతం చేయాలి ....తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎస్కె అబ్దుల్లా

Published: Monday June 27, 2022
జన్నారం రూరల్, జున్ 26, ప్రజాపాలన: 
 
పోడు భూముల సమస్యలు పరిష్కారం కోసం మంచిర్యాల కలెక్టరేట్ ముందు  సోమవారం తలపెట్టిన  ధర్నాలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గోని విజయవంతం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎస్కె అబ్దుల్లా అన్నారు, ఆదివారం జన్నారం మండలంలోని  ఇందన్  పల్లి వద్ద వార్డు పటేల్  జుగునాక మోతీరాం తో కలిసి కొమురం భీం  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ముందుగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీ గిరిజనుల సమక్షంలో, ఆదివాసీ గిరిజన సంఘం  జెండాను గడ్డం గూడెం లో విజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఐక్యంగా ఉంటూ సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు., పేద వర్గాల హక్కుల కోసం భూమి, ఇంటిస్థలం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, విద్య , వైద్యం ఉపాధి లాంటి సమస్యల సాధనకై పోరాడాలని కోరారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్, గంగుబాయి, ప్రకాష్ వివిధ గ్రామాల ఆదివాసులు పాల్గొన్నారు.