వికారాబాద్ జిల్లాలో విద్యుత్ కంట్రోల్ రూమ్ నూతనంగా ఏర్పాటు

Published: Saturday December 24, 2022
* విద్యుత్ శాఖ డైరెక్టర్ జే శ్రీనివాస్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజా పాలన : వికారాబాద్ జిల్లాలో విద్యుత్ కంట్రోల్ రూమ్ నూతనంగా ఏర్పాటు చేయనున్నామని విద్యుత్ శాఖ డైరెక్టర్ జై శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఉన్నత అధికారి డైరెక్టర్ ఆపరేషన్ జే శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో విద్యుత్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సేవలు డిసెంబర్ 24వ తేదీ శనివారం నుంచి జిల్లాలోని వినియోగదారులకు రైతులకు అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయము కలిగిన, నియంత్రికలు కాలిపోవడం, మెరుగైన సేవలు అందించేందుకు 24×7 గంటలు కంట్రోల్ రూమ్ పనిచేయుచున్నదని తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం స్థానిక డి ఈ కార్యాలయం ఆవరణలో విద్యుత్ కంట్రోల్ రూమ్ యొక్క సెల్ నెబర్ 9 4 9 1 441225, 9 4 9 3 193 177 ఫోన్ నంబర్లకు సమాచారం అందించి సేవలు అందుకోవాలని జయరాజు ఎస్సీ వికారాబాద్ డి ఈ తాండూర్ భాను ప్రసాద్ డి ఈ వికారాబాద్ సంజీవి కోరారు.