ఏపీజీవీబీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

Published: Saturday October 09, 2021
బోనకల్, అక్టోబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం పరిధిలోని ముష్టి కుంట గ్రామపంచాయతీ ఆవరణంలో ఈరోజు గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఐ సి ఇంచార్జ్ డి మోహన్ రావు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుపుకొనుట వలన పొందు ప్రయోజనములు, బ్యాంకు వారు అందించు ఏటీఎం రూపే కార్డుల లావాదేవీలు జరుపుకొనుట వలన పొందు ప్రయోజనములు 4 అంకెల రహస్య నెంబరును, ఇతరులకు తెలియపరుచుట వలన జరుగు నష్టముల గురించి వివరించడం జరిగింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన భీమా, పెన్షన్లు/పాలసీలు పి ఎం జె జె బి వై/ పి ఎం జె ఎస్ బి ఐ/ ఏపీ వై పాలసీ ల గురించి  చేరుట వలన పొందే రక్షణ, ప్రయోజనం గురించి వివరించి, 18 నుండి 70 సంవత్సరాల్లోపు వయస్సు గల వారందరినీ వాటిలో చేరమని వివరించడమైనది.  బ్యాంకు మేనేజర్ సీతారాములు మాట్లాడుతూ ఒక వ్యక్తిపై ఒక పొదుపు ఖాతా కంటె, ఎక్కువ ఖాతాలు ఉన్నచో, ఒక ఖాతాను ఉంచుకొని, ఆ ఖాతాదారుకు మొబైల్ నెంబర్‌ను నమోదు చేయించుకొని మిగిలిన ఖాతాలను ముగించుకొనుట వలన పొందే ప్రయోజనములు గురించి వివరించి గ్రామములో బ్యాంకు మిత్ర చేయు సేవల గురించి వాటిని ఉపయోగించు కొనుట గురించి, వాటి వలన పొందు ప్రయోజనములు సమయం, రవాణా ఖర్చులు మిగులునని చిన్న మొత్తంలో పొదువు చేసుకోవడం వలన భావి జీవితములో ఉపయోగపడునని వివరించరు. బ్యాంకు అందుబాటులో గల పొదుపు ఖాతాలు సేవింగ్ అకౌంట్, ఆర్ డి ఎకౌంట్, సేవింగ్ డి టి ఆర్ గురించి వాటిలో పొదుపు చేసుకొనుట వలన పొందు రక్షణ, ప్రయోజనాల గురించి, 10 సంవత్సరముల వయస్సు దాటిన పిల్లలకు పొదుపు ఖాతాను ప్రారంభింపజేసి వారితో పొదుపు చేయుట అలవాటు చేయడం వలన భావి జీవితములో ఉపయోగపడునని వివరించి, బ్యాంకులో అందుబాటులో గల రుణ సదుపాయాలు,వ్యవసాయ అనుబంధ, విద్యా, వ్యాపార, తనూఖా, గృహ నిర్మాణ, బంగారు వస్తువులపై తాకట్టు ఎస్ హెచ్ జి  ప్రభుత్వ రాయితీ రుణముల ను బ్యాంకు నుండి తీసుకొని సక్రమంగా ఉపయోగించుకొని సకాలంలో చెల్లించుట వలన పొందు ప్రయోజనముల గురించి వివరించి, బ్యాంకులో అందుబాటులో గల సేవలు ఎన్ ఈ ఎఫ్ టి/ ఆర్ టీ జి ఎస్ వాటిని ఉపయోగించుకోవడం వలన పొందు ప్రయోజనములు ఎస్బిఐ లైఫ్, హెల్త్, యాక్సిడెంటల్, క్రాఫ్ ఇన్సూరెన్స్ గురించి వాటిలో చేరడం వలన పొందు ప్రయోజనముల గురించి వివరించి, ప్రతి ఇంటి ఆవరణములో మరుగుదొడ్డి, ఇంకుడుగుంత, పొలంలో చిన్నపాటి చెక్ డ్యాంలు నిర్మించుకోవడం వలన పొందు ప్రభుత్వ రాయితీ, ప్రయోజనాల గురించి, మొక్కలు నాటుకొనుట వలన పొందు ప్రయోజనముల గురించి వివరించి. గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్బిఐ ఖమ్మం వారు ఆర్ ఎస్ ఐ పి ఈ టి ఐ ద్వారా, మహిళ శిక్షణ  కేంద్రం, టేకులపల్లి, ఖమ్మం, నేషనల్ కనస్ట్రక్షన్ (ఎం ఏ సి)కొత్తగూడెం, నవభారత్ మహిళ సాధికార కేంద్రం, నవభారత్ ఒకేషనల్ ఇనిస్టిట్యూట్, పాల్వంచ వారి ద్వారా ఇచ్చు ఉచిత శిక్షణ తరగతుల ద్వారా శిక్షణ పొందడం వలన భావి జీవితంలో స్థిరపడవచ్చునని వివరించరు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఓ వీరబాబు, ఛానల్ మేనేజర్ ప్రసాద్, బ్యాంకు సిబ్బంది, మున్నా, బ్యాంకు మిత్ర శైలజ, సర్పంచ్ బి జానబి, ఎం పి టి సి విజయలక్ష్మి గ్రామ ప్రజలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.