వ్యక్తిగత క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలకు - హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు

Published: Wednesday November 23, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
విద్యార్థులు వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలన పుస్తక పఠనం వంటి వాటిని అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. నాంపల్లిలోని అరోరా కాలేజీలో నిర్వహించిన ఆలాప్  కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఇఓ ఖ్యాతి తో కలిసి ఆయన ప్రసంగించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచమే కురు గ్రామంగా మారిపోయిందని ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతుల పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నైతిక విలువలతో కూడిన విద్య బుద్ధులను విద్యార్థులకు అందించడం ద్వారా మంచి సమాజం ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు కోసం రూపొందించిన డివిడిని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రధోఫ్ చంద్ర పట్నాయక్, వైస్ ప్రిన్సిపల్ సుష్మా చౌదరి హెచ్వోడీలు దీపిక విజయ శ్రీ తదితరులు పాల్గొన్నారు.