అడ్మిషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Published: Thursday May 13, 2021
జగిత్యాల, మే 12 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్  ఇనిస్టిట్యూట్ బాయ్స్ మరియు గర్ల్స్ 5వ తరగతి అడ్మిషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోస్టర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బీద బడుగు బలహీన వర్గాల మరియు ముస్లిం మైనార్టీలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్ వందల సంఖ్యలో మైనార్టీ, బిసి, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. గురుకులాల ఏర్పడ్డ తర్వాత విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారని అన్నారు. గురుకులాల ద్వారా దాదాపు 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని నాణ్యమైన దుస్తువులు భోజన వసతి కల్పించి ప్రైవేట్ కు దీటుగా నిర్వహిస్తున్న ప్రభుత్వం అని అన్నారు. ప్రతి మైనార్టీ గురుకుల పాఠాశాలలో 25 శాతం ఇతర మతాల వారికి కూడ అవకాశం కల్పించారని విద్యార్థులలో కుల మత ప్రస్తావన లేకుండ అందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల వలె కలిసి ఉండేలా లౌకిక రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం సీఎం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రాజేందర్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.