తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.....

Published: Tuesday September 27, 2022

జవహర్ నగర్ (ప్రజాపాలన) : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా జోహార్ నగర్ రజక సంఘం వారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా డిప్యూటీ మేయర్ శెట్టి శ్రీనివాస్, కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్  ఆమె విగ్రహానికి పూల మాలలతో ఘన  నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రపంచానికి చాటిచెప్పి మహా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత, ఆమె నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా  భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి  విముక్తి కోసం జరిగిన పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. దొరల గడీల గుండెలపై గర్జించిన   విప్లవమూర్తి అని, ఉన్నతమైన ఆశయాల కోసం ఉద్యమిస్తున్న  ప్రజలకు ఆమె పోరాటం ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మెడలయ్య రజాక సంఘం అధ్యక్షుడు శనిగరం నరసింహ, ఉపాధ్యక్షుడు గోవుల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి రమేష్, సంఘం సభ్యులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..