విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ ,నోట్ బుక్స్ పంపిణీ

Published: Tuesday July 19, 2022
బోనకల్, జులై 19 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో కుంటు ముక్కల నారాయణ సక్కుబాయి ల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కుంటు ముక్కల వెంకటేశ్వర్లు ఎన్ఆర్ఐ వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నారాయణపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగినది. మరో లక్ష రూపాయలతో పాఠశాలలోని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగినది. జానకిపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగినది. ఈ విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున పారితోషికం ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగినది. పాఠశాలకు బత్తినేని సతీష్ డిజిటల్ టీవీని బహుకరించడం జరిగినది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఈఓ ఇందిరా జ్యోతి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించబడుతుందని, ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రారంభించడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని అన్నారు. ఎన్నారై, నారాయణ మాట్లాడుతూ. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, గ్రామీణ ప్రాంతంలో చదువుకొని అమెరికాలో స్థిరపడటం జరిగిందని, విద్యార్థులందరూ కష్టపడి చదువుకోని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాదినేని చంద్రకళ,వారి కుటుంబ సభ్యులు కుంటుముక్కల వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు సునీత, వాణి, గోకుల్ ,తేజ, గ్రామ పెద్దలు కరివేద అమరయ్య, సూర్యదేవర సుధాకర్ సాదినేని మల్లికార్జునరావు, కాకాని హనుమంతరావు, అంచె భద్రయ్య, యాలముడి వెంకటేశ్వర్లు, కరివేద సుధాకర్ ,సూర్యదేవర వంశీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు,అంజయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు అప్పారావు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area