అశ్వాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.

Published: Saturday September 24, 2022
టిఆర్ఎస్ పార్టీలో చేరినా కాంగ్రెస్ టిడిపి సీనియర్ నాయకుల.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం. ప్రజా పాలన.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం TRS పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి సమక్షంలో....అశ్వాపురం మండల TRS పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో.... అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామ పంచాయతీ కి చెందిన కంటిబోయేనా నరేష్ ( ఉప సర్పంచ్) కాటిబోయినా గంగయ్య (FRS కమిటీ చైర్మన్) కొమరం నాగేశ్వవారవు, బోశెట్టి శ్రీను,కటిబోయేనా లక్ష్మయ్య ,కాటిబోయిన బాబురావు,సనప వెంకటేశ్వర్లు,కొమరం రాముడు,తాటి రామకృష్ణ,గొల్లపల్లి ముత్తయ్య,సాయం నరసింహారావు ( మాజీ సర్పంచ్) శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు,వారందరికీ గులాబి కండవా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ,
సీఎం కేసీఆర్ గారి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు, పేదల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత సీఎం కేసీఆర్ గారిది అని ఆయన అన్నారు, ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీలో 100 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల బీమా చెక్కును అందజేస్తున్నామని అన్నారు, అనేక గ్రామాలలోనూ ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందుతున్నదని అన్నారు, గ్రామాలలోనూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు, రైతులకు పంట పెట్టుబడి సాయం చేయాలనే దృఢ సంకల్పంతో రైతుబంధు రైతు బీమా వండి చారిత్మాతక పథకాలను సీఎం కేసీఆర్ గారు రూపకల్పన చేశారు అన్నారు ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయిని అన్నారు, పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా లక్ష 116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని అన్నారు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాయనిద్దరి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు, పినపాక నియోజకవర్గం నడిపించినందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తామని అన్నారు టిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు క్రమశిక్షణ నిబద్ధతతో నియోజవర్గ అభివృద్ధిలో భాగ్యస్వామ్యం కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అశ్వాపురం మండల అధ్యక్షుడు కూడా అమరేంద్ర  అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ , పోడియం నరేంద్ర  కార్యకర్తలు, అభిమానులు , తదితరులు పాల్గొన్నారు.