మాటూరు హైస్కూల్ టెన్త్ విద్యార్థులకు కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్

Published: Wednesday February 09, 2022
మధిర ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని మాటూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాటూరు పి.హెచ్.సి ఆరోగ్య సిబ్బంది శ్రీమతి సత్యవాణి, శ్రీమతి విజయలక్ష్మి లచే కోవిడ్ వాక్సిన్ అందించటం జరిగింది ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీవి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ కరోనా వంటి ప్రమాదకరమైన రోగాలు ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని తెలియజేస్తూ ఎవరూ వ్యాక్సిన్ గురించి అపోహలు పెట్టుకోవద్దు, అందరికీ వ్యాక్సిన్ అవసరమని తెలిపారు. గత  సంవత్సర కాలంగా కరోనా వ్యాక్సిన్ ను అందరికీ అందిస్తు విశేష కృషి చేస్తున్న ఆరోగ్య సిబ్బంది ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, బానోత్ బావ్ సింగ్, వేము రాములు, పి లక్ష్మి, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.