తెలంగాణలో భూములు పంచింది కాంగ్రెస్ ప్రభుత్వమే:భట్టి విక్రమార్క

Published: Saturday September 17, 2022
మధిర సెప్టెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు సీఎల్పీీ బట్టి విక్రమార్క మాట్లాడుతూ మత ఘర్షణలు సృష్టించి తెలంగాణను కబళించాలని ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకర శక్తులు సెప్టెంబర్ 17 విమోచన కాదు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజువిమోచన పేరిట సభలు జరపడం సరికాదు ఉత్సవాలు గర్వంగా గౌరవంగా ఉండాలే తప్ప గాయపరచొద్దు. తెలంగాణలో భూములు పంచింది కాంగ్రెస్ ప్రభుత్వమే మతోన్మాద శక్తులను మధిర దరిదాపులకు రానివ్వొద్దు తెలంగాణ వజ్రోత్సవాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిజాం రాజ్యం నుంచి తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన 1948 సెప్టెంబర్ 17 రోజును నిజాం నుంచి విమోచన వచ్చిందని మతం రంగు పూసి ఆనాటి గాయాలు అన్ని లేపి గుర్తు చేసి మరోసారి తెలంగాణలో మత ఘర్షణలు సృష్టించి రాష్ట్రాన్ని కబలించుకోవాలని మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కేంద్రంలో జరిగిన తెలంగాణ వజ్రోత్సవ వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు జరిగిన పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేని రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ అధికారం పొందడానికి చరిత్రను వక్రీకరించే విధంగా హైదరాబాదులో సభలు జరుపుతున్నారని మండిపడ్డారు.ఇది స్వాతంత్రం కాదు. విమోచన దినమని, ఆనాడు రజాకార్లు చేసిన అకృత్యాలకు, అరాచకాలకు మతం రంగు పూసి ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టడానికి విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న ప్రయత్నాలను పోరాటాలకు వారసులైన మధిర గడ్డ బిడ్డలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.సాయుధ పోరాటం నడిపిన మధిర గడ్డ పరిసర ప్రాంతాల దరిదాపులకు మతతత్వ శక్తులను రానివ్వొద్దని విజ్ఞప్తి చేశారు.బ్రిటిష్ రాజ్యం నుంచి భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందన్నారు. అదేవిధంగా నిజాం రాజ్యం నుంచి సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందన్నారు.ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అయినప్పుడు సెప్టెంబర్ 17 స్వాతంత్రం దినోత్సవం కాకుండా ఇంకో పేరు పెట్టి ఉత్సవాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.తెలంగాణ వజ్రోత్సవాలు గర్వంగా, గౌరవంగా ఉండాలి తప్ప ప్రజల మనసులను గాయాలు చేసే విధంగా ఉండొద్దని పేర్కొన్నారు. ఆనాడు జరిగిన పోరాటంలో పాల్గొన్న పోరాటయోధులను, వారి వారసులను ఈ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గౌరవించుకోవాలని తెలిపారు.దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు భూమి హక్కు కల్పించిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జాగిర్దారులు పటేళ్లు పట్వారిలు భూస్వాముల వద్ద వేల ఎకరాలు ఉన్న భూమిని దున్నేవాడికే భూమి హక్కు కల్పించాలని 1952 సంవత్సరంలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ టెన్ న్న్సీ యాక్టు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా దేశంలో కాంగ్రెస్ భూ పంపిణీ చేసిందని గుర్తు చేశారు.దేశానికి, తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నే స్వాతంత్రం తీసుకువచ్చిందన్నారు.60 ఏళ్ల తెలంగాణ కలను కూడా కాంగ్రెస్ పార్టీనే నెరవేర్చిందని తెలిపారు. ప్రజల ఆశలు,ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో మత ఘర్షణలు సృష్టించి తెలంగాణను కబళించడానికి మతోన్మాద శక్తులు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అడ్డుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. కిషోర్ వేణు రామారావు నవీన్ రెడ్డి జాంగిర్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు