నూతన పాఠశాల బిల్డింగులు భేష్.. రెడ్డిగూడెంలో కలెక్టర్ వీపీ గౌతమ్..

Published: Saturday October 01, 2022
తల్లాడ, సెప్టెంబర్ 30 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలంలోని కొడవటిమెట్ట (రెడ్డిగూడెం) గ్రామంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. గ్రామ సర్పంచ్ బద్దం నిర్మల ఆధ్వర్యంలో మన ఊరు _ మనబడి ద్వారా పాఠశాలలో నూతన బిల్డింగులు నిర్మిస్తున్నారు. ఈ పనులను కలెక్టర్ స్వయంగా దగ్గరుండి పనులను పరిశీలించారు. పాఠశాల భవనం నాణ్యతతో ఉండటంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  నూతనంగా నిర్మించే బిల్డింగులు నాణ్యతను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహాశీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఆర్ఐ రాధిక, ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి, స్థానిక నాయకులు బద్దం కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.
 
 
 
Attachments area