**రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కొత్త రుణాలు మంజూరు చేయటం కోసం అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్

Published: Saturday February 04, 2023
మంచాల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో రైతులకు క్రాప్ లోన్ రుణాలు.లక్ష లోపు  పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తాను అని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి ఏండ్లు గడుస్తున్నా ఇప్పట్టి వరకు ఏ ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు అన్నారు. బ్యాంక్ లో రైతుల తీసుకున్న క్రాప్ రుణాలకు వడ్డీకి వడ్డీ పెరిగి లక్షలు దాటి పోవటంతో బ్యాంక్ అధికారులు సకాలంలో బ్యాంక్ వడ్డీలు కట్టాలి లేక పోతే రుణాలు మొత్తం కట్టాలి అని రైతుల ఇంటి దగ్గరకు వెళ్లి రైతులను నాన ఇబ్బందులకు గురి చేస్తూ రైతుల పరువు తీస్తున్నారు అన్నారు. ఇ విషయం పై ప్రతి పక్ష పార్టీలు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని ఎన్ని ఉద్యమాలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చీమ కుట్టి నట్టు కావటం లేదు అన్నారు రైతులను అన్ని విధాలుగా అఫుకుంటాను రైతును రాజును చేస్తాను అని రైతులకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి అసెంబ్లీ సమావేశంలో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కొత్త రుణాల మంజూరు కోసం బడ్జెట్ ప్రవేశ పెట్టి
రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన గుణపాఠం చెప్పుతాం అని హెచ్చరిస్తున్నాం.