ఈనెల19న జరిగే రాష్ట్ర బందును జయప్రదం చేయండి

Published: Wednesday May 18, 2022
సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల 
 
ఆసిఫాబాద్ జిల్లా మే 17 ప్రజాపాలన, ప్రతినిధి) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 19వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బందును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బంద్ కు సంబంధించిన కరపత్రాలను ఆటో, ట్రాలీల, కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని కుదేలుచేస్తున్నారని, ట్రాన్స్ పోర్ట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.2019 లో ఎన్ వి ఆర్ట్ తీసుకువచ్చి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడాన్ని ఖండిస్తూ, వెంటనే ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అదేవిధంగా  ఫిట్నెస్ పేరుతో ప్రతి రోజు రూ 50 చొప్పున ఆటో, ట్రాలీ, లారీ, డ్రైవర్ ల పై టాక్సీ ల పేరుతో వసూలు చేయడాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం చారి, బాలు, తిరుపతి,రమేష్, లక్ష్మణ్, సాయి, నానాజీ, తదితరులు పాల్గొన్నారు.