ఆలేరు ఎన్.సి.సి విద్యార్థుల సేవలు అభినందనీయం

Published: Monday June 20, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 19 జూన్ ప్రజాపాలన: ఎన్.సి.సి. విద్యార్థుల సేవలు ఎంతో అభినందనీయమని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.
ఆలేరు జిల్లాపరిషత్ పాఠశాల ఆవరణలో హీల్ స్వచ్చంద సంస్థ నిర్వహణలో శాసనసభ్యురాలు సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ వైద్యుల బృందం ఉచిత మెగా వైద్య శిబిరం (ఎముకల) నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ ఈ పాఠశాల  ఆలేరు ఎన్.సి.సి.విద్యార్థులు చిన్న తనంలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. పెరిగి పెద్దయ్యాక ఈ జ్ఞాపకాలు ఎంతో సంతృప్తిని ఇస్తాయన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ఎన్.సి.సి. అధికారి దూడల వెంకటేష్ ప్రజలను అవగాహన చేసే విషయంలో 100 రోజులు కష్టపడడం అభినందనీయమన్నారు. గత ఎన్నో సందర్భాల్లో కూడా ఎన్.సి.సి. సేవలను ఉపయోగించుకున్నామని అలాంటి ఈ విద్యార్థుల భవిష్యత్ బాగుండాలని, ఎప్పటికి ఇలాగే ఎన్.సి.సి. ముందుండాలని ఆకాంక్షించారు. అలాగే మెగా శిబిరానికి విచ్చేసిన వైద్యుల బృందం తో పాటు వీరి సేవలను పలువురు అభినందించారు.