ప్రజా సమస్యలపై పాదయాత్రలో సీఎల్పీ భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికిన మండల ప్రజలు

Published: Tuesday April 19, 2022
మధిర ఏప్రిల్18 ప్రజాపాలన ప్రతినిధి : మండలం పరిధిలో సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కారాని కే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రజలకు శరాఘాతంగా మారిన ధరలు పేదోడి చీప్ లిక్కర్ పై కూడా దోపిడే  రైతుబంధు మాటున కనుమరుగయిన రైతు సంక్షేమం తోడ్పాటునాపాదయాత్ర రాజకీయం కోసమో ఎన్నికల ప్రచారం కోసమో కాదని, ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పీపుల్స్ మార్చు నిర్వహిస్తున్నట్లు సీఎల్పీ నేత శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని దేశినేని పాలెం గ్రామం నుండి ఆయన పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలను కలిసి వారి సమస్యలను విన్న అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అభివృద్ధి అనేది ఊహల్లో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వాలు ప్రజలపై పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ మోయలేని భారాన్ని వేస్తున్నారని బట్టి పేర్కొన్నారు. గత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని, అమ్మ హస్తం పేరుతో తొమ్మిది రకాల సరుకులను నెల నెల అందించామని కానీ నేడు ఆ సరుకులు సంచి మాయమైపోయిందని కేవలం బియ్యం ఇస్తున్నారని, దీనిని కూడా ప్రభుత్వనేతలు గొప్పలుగా చెప్పుకుంటున్నారని భట్టి విమర్శించారు. పేదలకు ఆసరా పెన్షన్ లను అందిస్తున్నాము అంటూ చెప్తున్న నాయకులు వారిచే పెన్షన్ కంటే అదనంగా ధరలను పెంచి ముక్కు పిండి ఖజానా నింపుకుంటున్నారని అన్నారు. గతంలో 25 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ నేడు 200 లేంది రావడంలేదని కూలి చేసుకునే వాడి అలసట తీర్చేందుకు తాగే చీప్ లిక్కర్ ను కూడా వదలకుండా దోపిడీకి ప్రభుత్వం పాల్పడుతున్నదని విమర్శించారు. గ్రామాల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని, 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానంటూ సీఎం చేసిన ప్రకటనలు అమలుకు నోచుకోవడం లేదన్నారు, రాష్ట్రం వస్తే మా బతుకులు బాగు పడతాయని యువత ఆశ పడ్డదని కానీ ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదువుకున్న యువకులు కూలి పనులకు పోతున్న పరిస్థితులు తల్లిదండ్రులకు కంటనీరు పెట్టిస్తున్నాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజల నుండి వచ్చే  సమస్యలపై సమాధానం చెప్పే పరిస్థితిలో లేకపోవడం ప్రభుత్వ పాలన తీరుకు అద్దం పడుతుందని ఇది అన్ని రాజకీయ పార్టీల కు చెందిన ప్రజల నాయకుల సమస్యలుగా మారిపోయిందని భట్టి పేర్కొన్నారు.  సంక్షేమాన్ని అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాజరిక వ్యవస్థలో కూడా మార్కెట్లు ఉండేవి కానీ ఇప్పుడు వరి వేస్తే ఉరి అనడం సరైంది కాదు రైతులు వేసినా పంటలు ప్రభుత్వాలు కొనడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కింద అందిస్తున్న ఐదు వేల రూపాయలతో రైతులకు గత ప్రభుత్వాలు అమలు చేసిన సబ్సిడీ విత్తనాలు పరికరాలు పంట రుణాల మాఫీ పావలా వడ్డీ రుణాలు పంట నష్ట పరిహారం వంటి వి కనుమరుగు అయ్యాయని హార్టికల్చర్ ద్వారా అందించే సబ్సిడీలు పంటల ప్రోత్సాహకాలు కానరాని పరిస్థితులు నెలకొన్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ ప్రజల కోసం ఎవరో ఒకరు పోరాటం చేయాలి అందుకే రాష్ట్ర ప్రజల అందరి తరుపున నేను పోరాటం చేస్తున్నానన్నారు. ఒక్క అసెంబ్లీ లో పోరాడితే సరిపొకనే ఈ పాదయాత్రతో ప్రజల మధ్యకు వచ్చినానన్నారుతాను పాదయాత్ర చేస్తున్నది ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా రాజకీయాలకతీతంగా ప్రజా సమస్యలను అభివృద్ధి అవసరాలను తెలుసుకుంటూ నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను చట్టసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకోవడంతోపాటు అవసరమైతే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని దీనికోసమే నేను పీపుల్స్ మార్చు పాదయాత్రను నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క మరోమారు పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన దేశినేని పాలెం ఇల్లూరు మహాదేవపురం గ్రామాలలో పాదయాత్ర చేపట్టగా ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఝాన్సీ కిరణ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ కిషోర్ బాలరాజు నవీన్ రెడ్డి వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి చంటి గోపి వేణు సంగయ్య వాసు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు