షర్మిలమ్మ పై మంత్రులు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడాన్ని ఖండించండి మండల వైయస్సార్ టిపి నాయకుల

Published: Friday September 16, 2022

బోనకల్, సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: వైయస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలమ్మ పై టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేయడాన్ని వైఎస్ఆర్ టీ పి బోనకల్ మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు, మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, మండల యూత్ అధ్యక్షుడు మంద నాగరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి, మంగళవారం షర్మిలమ్మ పై అసభ్యకర మాటలతో కామెంట్ చేయడం తప్పు కాదా అంటూ, షర్మిలమ్మ నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తుంటే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్రతం చేస్తున్నారని ఎగతాళి చేయడం తప్పు కాదా అంటూ మండిపడ్డారు. షర్మిలమ్మ తెలంగాణలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తూ నిరుద్యోగ పక్షాన, రైతుల పక్షాన ,మహిళల పక్షాన ఎస్సీ, ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ సబ్బండ వర్గాల పక్షాన సమస్యలు తెలుసుకుంటూ ప్రజాప్రస్థానం పాదయాత్ర లో భాగంగా 2000 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేస్తే షర్మిలమ్మ పై టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడాన్ని చేతగానితనముగా పనికిమాలిన చర్యగా వైయస్సార్ తెలంగాణ పార్టీ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రీవి లేజ్ కమిటీ కి అంశాన్ని పంపించామని చెప్పడం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని మంత్రులకు ఎమ్మెల్యేలకు చెప్పడం చూస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, షర్మిలమ్మ ప్రజాప్రస్థానం పాదయాత్ర చూసి వారవలేక మంత్రులు ఫిర్యాదు చేశారని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉందని , సీఎం కేసీఆర్ ఒకసారి మాట్లాడిన మాటలు రికార్డు లు తిరిగి చూస్తే వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చెప్పాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపడుతున్నప్పుడు ఇక్కడ సమస్యలను బట్టి ఆ మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఎక్కడ ప్రజల ఫిర్యాదు చేస్తే వాటి మీద మీ స్పందించడం ఒక మహిళను మీరు కామెంట్ చేయడం తప్పు అని,ఒక మహిళ ప్రజా సమస్యలపై పోరాడు తుంటే , మంత్రులు ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే కెసిఆర్ ఏమి చెప్పలేని పరిస్థితి అని ఎద్దేవ చేశారు. తెలంగాణలో పాదయాత్ర చూసి ఓర్వలేక డి జి పి కి ఫిర్యాదు చేస్తున్నారనీ, స్పీకర్ ఏమో ఫ్రీ విలెజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నారనీ, సీరియస్ గా వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మకు వస్తున్న ప్రజాదరణ చూడలేక ఈ విధంగా చేస్తున్నారని అర్థమవుతుంది. దళిత బంధు, దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానన్న సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు హామీని నెరవేర్చలేదని, ఇన్ని సమస్యలపై స్పందించకుండా ఈ సమస్యలను గాలికి వదిలేసి షర్మిలమ్మ పై ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్కు ఫిర్యాదు చేయడం రాజకీయ సరైనది కాదని ప్రభుత్వంపై మండిపడ్డారు.