దూరమంటున్న తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్య చదువులు

Published: Wednesday February 02, 2022
హైదరాబాద్ 31 జనవరి ప్రజాపాలన ప్రతినిధి : పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో దూరమవుతున్న చదువులు అంటూ పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో స్టడీ మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. స్టడీ మెటీరియల్స్ కొరకు బ్యాంకు ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ తీసి సంబంధిత సెక్షన్ లో సంప్రదించగా పుస్తకాలు అందుబాటులో లేవని చెబుతున్నారు. సంబంధిత సెక్షన్ ఇంచార్జీ కూడా గైర్హాజరు కావడంతో ఎంతో దూరం నుండి వచ్చిన విద్యార్థులు అవస్థలు పడ్డారు. వెబ్ సైట్ లో ఉన్న 040 23241923 లాండ్ లైన్ ఫొన్ నంబర్స్ కు కార్యాలయం పని వేళలో కాల్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఫోన్ తీసేవారు కరువైనారని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. సుదూర ప్రాంతాలనుండి ఎంతో వ్యయ ప్రసాల కోర్చి వచ్చిన విద్యార్థులు  చేసేది లేక వట్టి చేతులతో వెనుతిరిగి పోతున్నారు. సంబంధిత అధికారులు సరిపడా స్టడీ మెటీరియల్స్ ను అందుబాటులో ఉంచి విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు