అంబేడ్కర్ ఆశయ సాదన కోసం కృషి చేయాలి

Published: Saturday August 27, 2022
సంఘం రాష్ట్ర కార్యదర్శి
 మేడి మహేశ్ పిలుపు
 
కరీంనగర్ ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి :
అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సమాజంలో,కుల నిర్మూలన అంతరాని తనాన్ని దూరం చేసేందు కృషి చేసిన మహనీయుడని అంబేడ్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడి మహేశ్ పిలుపు నిచ్చారు.
 శుక్రవారం మానకొండూర్
 ‌మండల‌కేంద్రంలో జరిగిన సంఘం నియోజక వర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను పెంపొదింపే విదంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడు సేవలు మరువ లేనివని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో అనిల్,ఎల్కపల్లి తిరుపతి,కొమురయ్య తదితరులు పాల్గోన్నారు.