పినపాక నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన అభివృద్ధి ప్రదాత పినపాక ఎమ్మెల్యే

Published: Friday November 18, 2022

బూర్గంపాడు (ప్రజా పాలన.)

పినపాక నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం. నిధులు తీసుకురావడంలో పినపాక నియోజకవర్గం అభివృద్ధి చెందడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న  ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. పినపాక నియోజకవర్గం లో ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధికి సుమారుగా 27 కోట్ల రూపాయలను తీసుకురావడంలో కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. దానిలో భాగంగా బూర్గంపాడు మండలానికి ఆరు కోట్ల రూపాయల కేటాయించడంపై జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మరియు ప్రజల వర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మండలం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందరూ భాగంగానే రోడ్లు, డ్రైనేజీలు,మంచినీళ్లు, ప్రాధాన్యత  ఇస్తున్నట్లు వారు తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు, ప్రజల కోసం మిషన్ భగీరథ, న ఇంటింటికి నీళ్లు తీసుకువచ్చిందని, తెలంగాణ ఆడపడుచుల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అమోఘమైన పథకాలు తీసుకొచ్చి ప్రజలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అందులోనే భాగంగా దళిత బంధు పథకం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని దళితుల అభివృద్ధికి  ఈ పథకం ఎంతో తోడ్పడుతుందని వారు తెలియజేశారు. ఇంకా రైతులకు 24 గంటలు కరెంటు తీసుకువచ్చి రైతులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు. రాబోయే కాలంలో ప్రభుత్వం మరింతగా అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రజలను అదేవిధంగా ఎవరైతే వారిని ఆదుకుంటారో ప్రజలు సునిసితంగా చూస్తున్నారని మరలా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలియజేశారు.