టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Published: Wednesday April 28, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజా పాలన : కార్పొరేషన్ పదవ డివిజన్ కార్పొరేటర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏ శుభ క్షణంలో మొదలైందో... తొలి అడుగు ఎక్కడ పడిందో... సంకల్ప బలం ఎంత బాగుందో... తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్లు ప్రస్తావన విజయవంతంగా పూర్తిచేసుకుని 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బొద్ర మోనీ రోహిణి రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కుర్ములగూడ (10వ డివిజన్లు) లో టిఆర్ఎస్ జండా ఎగరవేసి, 21 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... 2001 ఏప్రిల్ 27న మొదలైన టిఆర్ఎస్ నేటికీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరు పేదలకు పండ్లు పంచి పెట్టారు. లక్ష్యమెంత సమున్నతమైన... సంకల్ప దీక్ష దారి దీపమవుతుంది. శిఖరమెంత ఎత్తున్నా... అడుగే పైకి చేర్చే నడకవుతుందిని స్థానిక కార్పొరేటర్ ఆన్నారు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజల గురించి ఆలోచనతో ముందుకు సాగే ఒక యుద్ధనౌక ల పనిచేస్తూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను యువకులను నేతలు ఆమె పిలుపు ఆదేశం మేరకు ఎల్లవేళలా ఉంటారని హామీ ఇచ్చారు. అదేవిధంగా కరోనా మహమ్మారి వైరస్ దరిదాపులకు రాకుండా, అందరూ జాగ్రత్తగా మాస్కులు, భౌతిక దూరం, పాటించి కరోనాను తరిమి కొడదామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీ.మల్లారెడ్డి, కే.భాస్కర్ రెడ్డి, బి.గణేష్ ముదిరాజ్, కే.సంతుగౌడ్, కే.మైపాల్ రెడ్డి, బి.మధు, ఏ.రాజు గౌడ్, బి.ఆంజనేయులు, పి.నరసింహ్మ, హెచ్.ప్రేమ్ కుమార్, ఎం.నార్సింగ్, కే.అశోక్ గౌడ్, శ్రీనివాస్, బి.నరేష్ కాలనీ వాసులతో తదితరులు పాల్గొన్నారు.