4 లైన్ల రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Friday November 18, 2022
మేడిపల్లి, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపూర్ వరకు సుమారు రూ ₹26.32 కోట్లతో నిర్మితమవుతున్న 4 లైన్ల రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను మేయర్ జక్క వెంకట్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.అలాగే విస్తరణలో ఇండ్లు,షాప్ లు కోల్పోతున్నవారి వద్దకు స్వయంగా వెళ్లి రోడ్డు విస్తరణకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.రోడ్డు విస్తరణలో ఇండ్లు, స్థలం కోల్పోయిన వారికి ప్రభుత్వం టిడిఆర్ బాండ్స్ రూపంలో నష్టపరిహారం చెల్లించడంతో పాటు సర్వం కోల్పోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రోడ్డు విస్తరణకు సహకరిస్తున్న ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేసి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాల్సిందిగా పేర్కొన్నారు. విద్యుత్, స్తంబాలు,ట్రాన్సుఫార్మర్లు ఎన్ని రోడ్లకు అడ్డంగా వస్తున్నాయో పూర్తి వివరాలు సేకరించి ఎక్కడైతే స్తంబాలు, ట్రాన్సుఫార్మర్లను షిప్టు చేయాల్సి ఉందో వెంటనే షిప్టు చేయాలని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎత్తు ఎక్కువగా ఉండే విద్యుత్ స్తంబాలు,బంచ్ కేబుల్స్ వేయాలని ఆయన ఆదేశించారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, సమస్యల పరిష్కరంలో నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, అలవాల సరితా దేవేందర్ గౌడ్, నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, అలవాల దేవేందర్ గౌడ్, 

టిపిశఎస్ రాజీవ్ రెడ్డి,విద్యుత్ అధికారులు,రెవిన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.